![]() |
![]() |
.webp)
ఆడవాళ్ళంతా ఒక్క చోట కలిసి ఉంటే ఆ ముచ్చటే వేరుగా ఉంటుంది. అందులోనూ శ్రీముఖి, సమంత, శ్రీలక్ష్మి, నందు రెడ్డి , గౌతమీ వంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అంతా ఒక్క చోట కనిపిస్తే ఇంకేముంది రచ్చ, సందడి, ధూమ్ ధామ్. ఇక త్వరలో సమంత, శ్రీముఖి, శ్రీలక్ష్మి, గౌతమీ వంటి వాళ్లంతా కలిసి నటించిన "మా ఇంటి బంగారం " మూవీ రిలీజ్ కాబోతోంది. దాంతో ఈ మూవీ ప్రొమోషన్స్ ని స్టార్ట్ చేశారు మూవీ టీమ్. ఇక వీళ్లంతా రాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి రాబోతున్నారు. రావడమే కాదు అల్లరి సందడి వంటివన్నీ చేయబోతున్నారు.
ఆ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "మా పరివారానికి సమంతా బంగారం వచ్చారు " అంటూ శ్రీముఖి అరిచి మరీ చెప్పింది. ఇక సమంత ఐతే ఆ మూవీలోని సాంగ్ కి డాన్స్ చేసి అందరిని ఫిదా చేసేసారు. " బాబోయ్ ఇది మీ కింగ్ డం కదా " అనేసరికి శ్రీముఖి సిగ్గు పడిపోయింది. "చూడండి మన ఫామిలీ అందరినీ ఒక దగ్గర కలిపాను. మీ హజ్బెండ్ ని నా హజ్బెండ్ ని కట్ చేసాను" అని శ్రీముఖి చెప్పేసరికి సామ్ పగలబడి నవ్వేసింది. ఇక ఈ షోలోకి ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ సమంత సిగ్నేచర్ డైలాగ్ ఉంటుంది. "ఒక్కొక్కరినీ కొడతాను చూడు " అని చెప్పేసరికి శ్రీముఖి "ఆ " అంది. "ప్రేమతో " అంటూ సామ్ మాట , ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసి సందడి చేశారు.
![]() |
![]() |